యాప్నగరం

రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన కేసీఆర్

నాలుగు రోజుల శీతాకాలం విడిదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఏటా డిసెంబరులో శీతాకాల విడిదికి రాష్ట్రపతి రావడం ఆనవాయితీ.

TNN 24 Dec 2017, 2:20 pm
శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఘనస్వాగతం పలికారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి గౌరవార్దం ఆదివారం రాత్రి గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన విందుకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల విడిది అనంతరం 27న విజయవాడ వెళతారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో కేవలం మూడు రోజులు మాత్రమే విడిదిచేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బొల్లారం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, బొల్లారం, సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అలాగే రాష్ట్రపతి విడిది సందర్భంగా నిలయంలో కోతులు, పాములను పట్టుకోడానికి బృందాలను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.