యాప్నగరం

రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మీడియా సలహాదారుగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూశారు.

TNN 21 Aug 2017, 9:12 am
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మీడియా సలహాదారుగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన్ని బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సోమవారం ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయ‌న అంత్యక్రియలు జరగనున్నాయి.
Samayam Telugu pvrk prasad media advisor to former pm pv narasimha rao dies
రిటైర్డ్ ఐఏఎస్ పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూత


కాగా, ప్రసాద్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేశారు. 1978 నుంచి 1982 వరకు తితిదే ఈవోగా పనిచేసిన ప్రసాద్.. రిటైర్ అయిన తరవాత కూడా తితిదే సలహాదారుగా వ్యవహరించారు. తిరుమ‌ల ప్రాశ‌స్త్యంపై ప‌లు పుస్తకాలు రాశారు. తిరుమల చరితామృతం, తిరుమల లీలామృతం, వెన్ ఐ సా తిరుపతి బాలాజీ, ద ప్రీస్ట్స్ ఆఫ్ తిరుమల పుస్తకాలతో పాటు నహం కర్త, అసలేం జరిగిందంటే.. (వీల్స్ బిహౌండ్ ద వెయిల్) పుస్తకాలను ప్రసాద్ రచించారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మీడియా సలహాదారుగా, అడిషనల్ సెక్రటరీగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. పీవీఆర్కే ప్రసాద్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.