యాప్నగరం

ఈ మూడు రోజులు ఇక వానలే

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఫలితంగా రానున్న

Samayam Telugu 12 Jun 2017, 10:28 pm
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఫలితంగా రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో అత్యల్ప వ్యవధిలోనే దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకి రుతుపవనాలు వ్యాపించాయి. ఈ రుతు పవనాలు ఉత్తర కోస్తాలోని నర్సాపూర్‌ వరకు వ్యాపించి వున్నాయని వాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
Samayam Telugu rains to pour in coming three days
ఈ మూడు రోజులు ఇక వానలే


రుతుపవనాల రాకతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పలుచోట్ల గత రెండుమూడు రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వేసవి తాపానికి విలవిల్లాడిన జనం, రైతులు ఈ వర్షాల రాకని ఆస్వాదిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.