యాప్నగరం

రూ.40 లక్షల విరాళం.. పాఠశాల భవనాన్ని ప్రారంభించిన రాజమౌళి

దర్శక ‘బాహుబలి’ రాజమౌళి మంచి మనసును చాటుకున్నారు. తన తల్లి పేరిట విశాఖ జిల్లా కశింకోట జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని భార్య రమతో కలిసి ప్రారంభించారు.

Samayam Telugu 2 Aug 2018, 3:46 pm
దర్శక ‘బాహుబలి’ రాజమౌళి మంచి మనసును చాటుకున్నారు. తన తల్లి పేరిట విశాఖ జిల్లా కశింకోట జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని భార్య రమతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణానికి రాజమౌళి రూ.40 లక్షల విరాళం అందించారు. పాఠశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలని ఉపాధ్యాయులను కోరారు.
Samayam Telugu rajamouli-rama


2014లో వచ్చిన హుద్‌హుద్‌ తుఫాన్‌ ధాటికి విశాఖ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల భవనాలు కూలిపోయాయి. ఆ జాబితాను పరిశీలించిన రాజమౌళి.. కశింకోటలోని దురిశేటి పెదనర్సింహమూర్తి (డీపీఎన్‌) జెడ్పీ హైస్కూల్‌‌‌ భవన నిర్మాణానికి రూ.40 లక్షలు సాయం అందించారు. ఈ స్కూల్‌కి 154 ఏళ్ల చరిత్ర ఉంది.

2015లో నాలుగు గదులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం ఇటీవలే పూర్తి కాగా.. గురువారం సతీమణితో కలిసి రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి దంపతులను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నూతనంగా నిర్మించిన భవనానికి రాజమౌళి తల్లి జననీ రాజనందినిగా పేరు పెట్టారు. ఈ భవన శిలాఫలకంపై ఎస్‌ఎస్‌ రాజమౌళి, వైఎన్‌ శోభనాద్రి, టి. ప్రశాంతి, ఎంఎం కీరవాణి పేర్లు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.