యాప్నగరం

శిరీషతోనే కాదు.. రాజీవ్ రాసలీలలు ఇంకెన్నో..!

బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మరణం కేసులో పోలీసుల

TNN 24 Jun 2017, 8:29 am
బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మరణం కేసులో పోలీసుల అదుపులో ఉన్న వల్లభనేని రాజీవ్ గురించి మరింత విస్మయకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహిత అయిన శిరీషతో అక్రమసంబంధం పెట్టుకుని.. మరో యువతితో ప్రేమకలాపాలను సాగిస్తూ.. ఈ వ్యవహారాన్ని పంచాయితీగా పోలీసు వద్దకు తీసుకెళ్లి.. ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో శిరీష మరణానికి కారకుల్లో ఒకరిగా ఉన్న రాజీవ్ రాసలీలలు మరిన్ని ఇన్నాయని తెలుస్తోంది.
Samayam Telugu rajiv romantic relationships
శిరీషతోనే కాదు.. రాజీవ్ రాసలీలలు ఇంకెన్నో..!


రాజీవ్ కు శిరీష, తేజస్వినిలతోనే గాక మరింతమంది యువతులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసుల విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. యువతులతో పరిచయాన్ని పెంచుకుని వారికి సన్నిహితంగా మెలగడం రాజీవ్ కు అలవాటే అని, అమ్మాయిలతో సన్నిహితంగా మెలుగుతూ సెల్ తో ఫొటోలు, వీడియోలు తీసుకునేవాడని తెలుస్తోంది. తర్వాత వాటిని ఉపయోగించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని సమాచారం.

ఇతడి సెల్ ఫోన్ లో అలాంటి వీడియోలు, ఫొటోలు దర్శనమిచ్చాయని తెలుస్తోంది. ఆర్జే స్టూడియోలోని ఇతడి కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో కూడా బోలెడన్ని వీడియోలు, ఫొటోలున్నాయి. శిరీష, తేజస్వినిలు కాకుండా.. మరో ముగ్గురు అమ్మాయిలు కూడా రాజీవ్ బాధితుల జాబితాలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.