యాప్నగరం

చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న రాజ్‌నాథ్‌సింగ్

ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఏసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.

Samayam Telugu 17 Jun 2018, 5:55 pm
ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఏసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకునేందుకు యత్నించారు.
Samayam Telugu rape_trial_fast_track_court_1518519990


నీతి ఆయోగ్ సమావేశానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ఏడు నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడటానికి వీల్లేదని, మిగతా సీఎంలు కూడా మాట్లాడాల్సి ఉందని చంద్రబాబుకు చెప్పారు. అయితే, చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపలేదు. విభజన జరిగిన నేపథ్యంలో ఏపీని ప్రత్యేకంగా చూడాలని, తమ సమస్యలను కేంద్రం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దాదాపు 20 నిమిషాల పాటు రాష్ట్ర సమస్యలను వివరించారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడిందని, తలసరి ఆదాయంలో ఎలాంటి వృద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి మద్దతు లభించడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా హామీ గురించి మాట్లాడుతున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మద్దతు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు మార్చాలనే డిమాండుకు మమతా సమర్ధించారు. బాబు చేసిన మరికొన్ని ప్రతిపాదనలకు ఇతర సీఎంలు మద్దతు పలికారు. ఈ సమావేశంలో మొదట ప్రసంగించే అవకాశం చంద్రబాబు నాయుడుకే దక్కడం గమనార్హం.

కేంద్రంపై చిర్రుబుర్రులు.. : ఈ సమావేశాన్ని వేదికగా చేసుకుని చంద్రబాబు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందంటూ ఎండగట్టారు. విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, పునరావస కల్పనకు అవసరమైన నిధులు సమకూర్చాలని డిమాండు చేశారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన రూ.350 కోట్ల నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.