యాప్నగరం

ఇవాంకతో స్టార్ హీరో భార్య సెల్ఫీ!

ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు ఆహ్వానం దక్కడమే చాలా మంది మహద్భాగ్యంగా భావించారు

TNN 29 Nov 2017, 3:38 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హాజరైన ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు ఆహ్వానం దక్కడమే చాలా మంది మహద్భాగ్యంగా భావించారు. అందులోనూ ఇవాంక ఆ సదస్సుకు హాజరైన సమయంలో అక్కడ ఉండటం అంటే లక్ అనే అనుకున్నారు. తాజ్ ఫలక్‌నూమాలో ఇవాంక కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విందుకు అతి తక్కువ మందికే ఆహ్వానాలు దక్కాయి. ఇవాంక భోజనం చేసిన హాల్ లోకి కేవలం వంద మంది కి మాత్రమే ప్రవేశం కల్పించారు.
Samayam Telugu ram charans wife impresses ivanka
ఇవాంకతో స్టార్ హీరో భార్య సెల్ఫీ!


ఇలా సాగుతున్న ఇవాంక హైదరాబాద్ టూర్లో.. అసాధారణమైన వాళ్లకు మాత్రమే ఆమె ఛాయల్లోకి వెళ్లే అవకాశాలను కల్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, వీవీఐపీ ట్రీట్ మెంట్ తో.. ఇవాంక ఛాయల్లోకి వెళ్లడం పెద్ద పెద్ద వాళ్లకు కూడా గగనం అయ్యింది. మరి అలాంటి వాతావరణంలో ఇవాంకా ట్రంప్ ను మెప్పించింది ఒక తెలుగు మహిళా వ్యాపారవేత్త. ఆమె మరెవరో కాదు.. ఉపాసన కామినేని. అపోలో ప్రతాపరెడ్డి మనవరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య.

ఈ సదస్సులో పాల్గొన్న తెలుగు మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరు ఉపాసన. ఈ సందర్భంలో ఈమె ఇవాంకతో కలిశారు. మాట్లాడారు. వ్యాపారవేత్తగా అనుభవాలను పంచుకున్నారు. పనిలో పనిగా ఇలా ఇవాంకతో కలిసి సెల్ఫీ దిగి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు చేశారు ఉపాసన!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.