యాప్నగరం

టీడీపీ ఎంపీలను జోకర్స్‌తో పోల్చిన వర్మ

వివాదాలతోనే సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సినిమాలతో కాకుండా నిరంతరం వివాదాలతోనే ఆయన వార్తల్లో ఉంటారు. తాజాగా టీడీపీ ఎంపీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

TNN 12 Feb 2018, 9:44 am
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు సినిమాలపై కాదు, రాజకీయ నాయకులపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ‘ఇలాంటి జోకర్స్‌ను ఏపీ ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారా అని ప్రధాని నరేంద్ర మోదీ భావించినా ఆశ్చర్యపడక్కర్లేదని, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాన్ని ఓ జోక్‌గా తీసుకుంటారు... ఈ ఎంపీలంతా జోకర్లకు తక్కువ, సీ....ఎస్‌కు ఎక్కువ’ అంటూ ట్వీట్ చేశారు.
Samayam Telugu ram gopal varma comments against tdp mps
టీడీపీ ఎంపీలను జోకర్స్‌తో పోల్చిన వర్మ



‘టీడీపీ ఎంపీల ఆందోళన చూస్తే ఆ పార్టీకి ఉన్న అంతర్జాతీయ పేరుప్రతిష్ఠలను జాతీయస్థాయిలో మంటగలుపుతున్నట్లుగా ఉంది’అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. పార్లమెంటు ఎదుట ఆందోళన చేస్తోన్న టీడీపీ ఎంపీ ఫోటోను పోస్ట్‌చేసిన వర్మ, దాని కింద వివాదస్పద వ్యాఖ్యలు రాశారు. ఎంపీలు మురళీ మోహన్, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, శివప్రసాద్‌లు నిరసన తెలుపుతోన్న ఫోటోపై వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో మరి.


లక్ష్మీస్ పార్వతి సినిమా విషయంలో టీడీపీ నేతలు, రామ్‌గోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. మరోసారి టీడీపీ ఎంపీలను ఉద్దేశించి వర్మ చేసిన కామెంట్లు వివాదానికి దారితీస్తాయనడంలో సందేహం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.