యాప్నగరం

ఏపీ ప్రజల కోసం రూ. 2000 కోట్లు

​ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా నగదు కష్టాలు ప్రజలను వెన్నాడుతున్నాయి.

TNN 6 Apr 2017, 8:43 am
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా నగదు కష్టాలు ప్రజలను వెన్నాడుతున్నాయి. ఏటీఎంలలో, బ్యాంకులలో కూడా డబ్బుల్లేక పోవడంతో అవసరానికి డబ్బులు చేతికి రాక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ కు తెలియజేసింది. తమకు వెంటనే డబ్బును పంపాలని కోరింది. ఏపీలో రెండు మూడు రోజులుగా ఏటీఎంలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. కాగా ఆర్బీఐ ఏపీకి వెంటనే డబ్బు పంపేందుకు అంగీకరించింది. నేడు రెండు వేల కోట్ల రూపాయలు పంపిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ డబ్బు కానీ ఏపీలోని ఏటీఎంలలో చేరితే... మరికొన్ని రోజుల వరకు ప్రజలకు ఫర్వాలేదు.
Samayam Telugu rbi sends rs 2000 crore to andhra pradesh banks
ఏపీ ప్రజల కోసం రూ. 2000 కోట్లు


మైసూరులో నగదు ముద్రణాలయం ఉంది. అక్కడ కూడా నగదు నిల్వ అడుగంటింది... దీంతో ఆర్బీఐ ఏపీ కోసం మధ్య ప్రదేశ్ ముద్రణాలయం నుంచి డబ్బును తెప్పిస్తోందట. మార్పి 31న రెండు వేల కోట్ల నగదును ఏపీ లోని బ్యాంకులకు ఇచ్చింది ఆర్బీఐ. ఆ డబ్బులన్నీ మూడు రోజుల్లోనే అయిపోయాయి. దీంతో మళ్లీ రెండు వేల కోట్లు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు ఏటీఎంల నుంచి, బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున నగదును తీసుకుంటున్నారు. కానీ బ్యాంకుల్లో వేసే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. అలాగే వ్యాపారానికి లోన్లు రూపంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడం కూడా కొరత తీవ్రంగా ఏర్పడడానికి కారణం కావచ్చు. ఏది ఏమైనా రెండు రోజుల్లో మళ్లీ ఏపీ ఏటీఎంలు డబ్బుతో కళకళ లాడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.