యాప్నగరం

ట్విస్ట్: రేవంత్‌ వచ్చేశారు..!

రేవంత్‌ రెడ్డి పార్టీ అందరికీ షాక్ ఇచ్చారు. శుక్రవారం (అక్టోబర్ 20) ఉదయం ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో ప్రత్యక్ష్యమయ్యారు. రేవంత్ ఉదంతంపై చర్చించడానికి టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సభ్యులు సమావేశం కాగా.. అక్కడికి ఆయన కూడా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

TNN 20 Oct 2017, 12:43 pm
రేవంత్‌ రెడ్డి పార్టీ మారబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతుండగా.. ఆయన ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. శుక్రవారం (అక్టోబర్ 20) ఉదయం ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో ప్రత్యక్ష్యమయ్యారు. రేవంత్ ఉదంతంపై చర్చించడానికి టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీ సభ్యులు సమావేశం కాగా.. అక్కడికి ఆయన కూడా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడేనని, అందుకే సమావేశానికి వచ్చానని రేవంత్ అన్నారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ టీడీపీ నేతలంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Samayam Telugu revanth reddy attends ttdp politburo meeting in ntr bhavan
ట్విస్ట్: రేవంత్‌ వచ్చేశారు..!


ఈ భేటీలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు పార్టీ కీలక నేతలంతా పాల్గొన్నారు. రేవంత్‌‌ పార్టీ మారుతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై నేతలంతా చర్చిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయణ్ని వివరణ అడుగుతున్నారు.

అంతకుముందు రేవంత్ కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. ఆయనతో పాటు కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు కూడా చెవులు కొరుక్కున్నారు. మొత్తానికి ఈ ఉదంతానికి తెర పడినట్లే కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా గురువారం ఆయన టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలిపినప్పుడే ఇప్పట్లో పార్టీ మారే అవకాశాలు లేనట్లు సంకేతాలు అందాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.