యాప్నగరం

ఆ ఫుటేజ్‌లు ఎక్కడ?: సర్కారును నిలదీసిన రేవంత్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ విసిరేయడంతో అవి కాస్తా గవర్నర్ పక్కనే ఉన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు తగలడంతో ఆయన కంటికి గాయమైంది.

Samayam Telugu 13 Mar 2018, 12:50 pm
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడం.. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ విసిరేయడంతో అవి కాస్తా గవర్నర్ పక్కనే ఉన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు తగలడంతో ఆయన కంటికి గాయమైంది. దీంతో సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను బహష్కరించారు. ఎమ్మెల్యేలు కోమటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో స్వామిగౌడ్‌పై నిజంగానే దాడి జరిగితే, ఆ వీడియోను ఎందుకు బహిర్గతం చేయడం లేదని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే మండలి చైర్మన్ ఆసుపత్రిలో చేరారని ఆయన ఆరోపించారు.
Samayam Telugu revanth reddy demands revealed yesterday cctv footages in assembly
ఆ ఫుటేజ్‌లు ఎక్కడ?: సర్కారును నిలదీసిన రేవంత్


రైతు సమస్యలను పరిష్కరించాలని తాము అసెంబ్లీలో నిరసన తెలిపామని రేవంత్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో కోమటిరెడ్డి హెడ్‌ ఫోన్స్‌ విసురుతున్నట్టు కనిపించింది తప్ప, అవే వెళ్లి స్వామి గౌడ్‌కు తగిలాయని మాత్రం కనిపించడం లేదని అన్నారు. మరో యాంగిల్‌లో వీడియోను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో ఉన్న ఆరు కెమెరాల ఫుటేజీలను బయటపెడితే అసలు నిజాలు బయటపడతాయని, వెంటనే వాటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన పాపాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్‌ శాసనసభలో ధుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కొన్ని సామాజిక వర్గాల పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో ఏ శాసనసభలోనూ ఇలాంటి‌ చర్యలు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు చట్టాల ముందు నిలబడవని ఉద్ఘాటించారు. అంతేకాదు గవర్నర్‌ ప్రసంగం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల ప్రస్తావన లేదని అన్నారు. శాసన సభ్యత్వాల రద్దైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌‌కు కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.