యాప్నగరం

సస్పెన్స్ పెంచి.. కన్ఫ్యూజన్లోకి నెట్టిన రేవంత్ పోస్ట్

టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ఇప్పటికైతే కాస్త క్లారిటీ వచ్చినట్టే కనిపించినా.. ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ మాత్రం..

TNN 18 Oct 2017, 7:23 pm
టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఆయన రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారనే వార్తలు వెలువడ్డాయి. ఇక ఆయన పార్టీ మారడం లాంఛనమే అనేంతలా మీడియాలో కథనాలు వచ్చాయి. రేవంత్ తొలుత ఈ వార్తల్ని ఖండించారు. మరోవైపు ఆయన పార్టీని వదలకుండా చూసేందుకు టీడీపీ తరఫున ప్రయత్నాలు జరిగాయి. ఆయన పార్టీని వీడరంటూ.. స్వయంగా చెప్పిన లోకేశ్ బాబు రూమర్లకు తెరదించేందుకు ప్రయత్నించారు.
Samayam Telugu revanth reddy diwali wishes telugu people what it means
సస్పెన్స్ పెంచి.. కన్ఫ్యూజన్లోకి నెట్టిన రేవంత్ పోస్ట్


రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులకు ఇక్కడేం పనంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల తీరునే ప్రశ్నించారు. దీంతో ఆయన పార్టీని వీడటం ఖాయమే అనే సూచనలు కనిపించాయి. రేవంత్ పార్టీని వీడినా నష్టమేం లేదంటూ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు.

పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. బుధవారం సాయంత్రం తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, నరకాసరుడిని హతమార్చిన స్ఫూర్తితో దుష్టపాలనకు చరమ గీతం పాడే చైతన్యం మీలో రావాలని కోరుకుంటూ.. అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.


ఆ ఫొటోలో ఆయన పచ్చ కండువా కప్పుకొని ఉండగా.. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ ఫొటోలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన పార్టీ తరఫునే శుభాకాంక్షలు తెలిపారని అర్థమవుతోంది. ఈ పోస్ట్ చూశాక.. రేవంత్ పార్టీని వీడుతున్నారా..? లేదా? అనే సస్పెన్స్‌ మరింత పెరిగింది. ఏదేమైనా ఆయన టార్గెట్ కేసీఆర్ సర్కారనే విషయం మాత్రం ఈ పోస్ట్ ద్వారా మరోసారి వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.