యాప్నగరం

సీసీ కెమెరాలు తిప్పేసి.. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీ

​ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏటీఎం చోరీకి గురైంది. సిండికేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు..

TNN 21 Sep 2017, 3:00 pm
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏటీఎం చోరీకి గురైంది. సిండికేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు.. గ్యాస్ కట్టర్ల సాయంతో నగదును దొంగిలించారు. ఏటీఎంలోకి ప్రవేశించగానే సీసీటీవీ కెమెరాలను పక్కకు తిప్పేసిన చోరులు.. రూ. 17.35 లక్షలను తస్కరించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 2-3 గంటల మధ్య ఈ దొంగతనం జరిగిందని భావిస్తున్నారు. పట్టణం మధ్యలో, పోలీస్ స్టోషన్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఏటీఎంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
Samayam Telugu robbery in syndicate bank atm in yemmiganur
సీసీ కెమెరాలు తిప్పేసి.. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీ


బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు ముగ్గురు కలిసి చోరీకి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.