యాప్నగరం

నగరంలో రాత్రి పూట.. యాక్టివాపై కోటిన్నర తరలిస్తూ..

ఎన్నికల వేళ హైదరాబాద్‌లో పోలీసులు కోటిన్నర నగదును సీజ్ చేశారు. యాక్టివాపై ఈ మొత్తాన్ని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.

Samayam Telugu 24 Mar 2019, 11:16 pm
ఎన్నికల వేళ హైదరాబాద్‌లో కోటిన్నర రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జరిపిన తనిఖీల్లో శనివారం రాత్రి ఈ నగదు లభ్యమైంది. ఇద్దరు వ్యక్తులు యాక్టివా స్కూటర్‌పై రెండు బ్యాగులను తీసుకెళ్తుండగా.. పోలీసులు వారిని ఆపారు. బ్యాగులను తెరిచి చూడగా.. రూ.1.49 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లను చూపించలేకపోయారు. దీంతో నగదును సీజ్ చేశారు.
Samayam Telugu cash1


స్కూటర్‌పై వెళ్తున్న వారిని అడిక్‌మెట్‌కు చెందిన గోపీనాథ్ (47), అతడి బంధువు రాఘవేందర్ (32)గా గుర్తించారు. గోపీనాథ్ అకౌంటెంట్‌గా పని చేస్తుండగా.. రాఘవేందర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ మొత్తాన్ని వీరిద్దరూ రమేశ్ అనే రియల్టర్ నుంచి అడిక్‌మెట్ తీసుకెళ్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణ కోసం ఈ నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.