యాప్నగరం

మహిళల రక్షణకు ప్రత్యేక 'వెబ్‌సైట్' ప్రారంభం!

మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'సఖి' పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆదివారం (జులై 22) ప్రారంభించింది.

Samayam Telugu 22 Jul 2018, 2:07 pm
మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'సఖి' పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని సఖి సెంటర్‌‌లో మంత్రి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం (జులై 22) వెబ్‌సైట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా రక్షణ కోసమే 'సఖి' వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 9 వన్‌స్టాఫ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తొలి కేంద్రం ఇదేనని ఆయన తెలిపారు.
Samayam Telugu sakhi


మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మహేందర్ రెడ్డి అన్నారు. మహిళలు తమ సమస్యలను 'సఖి' వెబ్‌సైట్ ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా మహిళలకు సలహా, సాంత్వన, రక్షణ అనే లక్ష్యాలతోపాటు కౌన్సిలింగ్, న్యాయ సేవలు, కేసు నమోదు, పోలీస్ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి, వీడియోకాన్ఫరెన్స్ సేవలు అందనున్నాయని ఆయన తెలిపారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్ ద్వారా ఈ సేవలను మహిళలకు అందించనుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు, గృహహింస, వరకట్న సమస్యలు, అక్రమ రవాణా, ఈవ్‌టీజీంగ్‌లు, లైంగికదాడులు వంటి అన్ని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 'సఖి' పేరుతో ఈ వెబ్‌సైట్ సేవలను ప్రారంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.