యాప్నగరం

ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు

అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 10) పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

TNN 10 Nov 2017, 3:19 pm
అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 10) పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. దూపదీప నైవేద్యం కింద 3 వేల ఆలయాలకు నిధులు ఇస్తామని తెలిపారు. ఈ పథకానికి కొత్త మార్గదర్శకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూముల సమస్యలపై చర్యలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
Samayam Telugu salaries for priests on par with government employees indrakaran reddy
ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు


గుప్త నిధుల పేరుతో ఆలయాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంద్రకరణ్‌ రెడ్డి హెచ్చరించారు. ఆలయాలు, భూముల పరిరక్షణపై అయిదుగురు మంత్రులతో ఉపకమిటీ వేసినట్లు తెలిపారు. ఆలయాల పరిరక్షణ, పూజారులను ఆదుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.