యాప్నగరం

వంశధార తీరంలో సైకత శివలింగం

మహాశివరాత్రి.. శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజున హిందువులంతా శివుణ్ని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

TNN 23 Feb 2017, 8:18 pm
మహాశివరాత్రి.. శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజున హిందువులంతా శివుణ్ని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆ పరమశివుణి అనుగ్రహం కోసం పూజలు, ఉపవాసం, జాగరణం చేస్తారు. అయితే శివరాత్రికి ఒక రోజుముందే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా.. శివునిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. జిల్లాలోని వంశధార నదీ తీరంలో శివరూపం, శివలింగం సైకత శిల్పాలను అద్భుతంగా నిర్మించారు. ఆయన నిర్మించిన శివసైకతం ఉన్న ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగానికి దగ్గరగా ఉంటుందని ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.
Samayam Telugu sand artist tarani prasad mishra created sand shiva sculpture for maha shivaratri
వంశధార తీరంలో సైకత శివలింగం


కాగా, తరణి ప్రసాద్ ఫిబ్రవరి 21న ఇదే వంశధార తీరంలో నిర్మించిన సైకత శిల్పం కూడా చూపరులను ఆకట్టుకుంది. ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా చెక్కిన ఈ సైకత శిల్పంలో పలు భాషలకు సంబంధించిన అక్షరాలను పొందుపరిచారు. మళ్లీ ఇప్పుడు శివుని సైకత శిల్పంతో మెప్పించారు. సాధారణంగా శివలింగం రాతి రూపంలో ఉంటుంది. ఇప్పుడు సైకత లింగాన్ని కూడా మనం చూడొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.