యాప్నగరం

ఎస్సీ,బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే

ఎస్సీ, బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.

Samayam Telugu 24 Apr 2017, 4:11 pm
ఎస్సీ, బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎస్టీ, మైనార్టీలకు పెంచేందుకు తీర్మానం చేసిన కేసీఆర్ ప్రభుత్వం.. ఎస్సీ,బీసీలకు పెంచకపోవడం వివక్షేనని ఆయన ఆరోపించారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో రిజర్వేషన్ల పెంపుపై వివిధ విద్యార్థి సంఘాల నేతలతో అఖిలపక్ష సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మందకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Samayam Telugu scs 18 bcs 52 percent reservations should be increased demands manda krishna
ఎస్సీ,బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందే


పార్లమెంటు సవరణ లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్సీ,ఎస్టీలలో వేరే కులాలను కలుపడానికి, తొలగించడానికి వీల్లేదని, అయినా కేసీఆర్ కొన్ని కులాలను ఎస్సీల్లో కలుపుతున్నట్లు ప్రకటించారని.. దీని ద్వారా తర్వాత సాంకేతిక సమస్యలు వస్తాయని మందకృష్ణ హెచ్చరించారు.

ఎస్సీలకు 15 శాతం ఉన్న రిజర్వేషన్లను 18శాతం, బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.