యాప్నగరం

20 వేల మంది పోలీసులతో సభకు బందోబస్తు!

శాంతిభద్రతల కోసం 20 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. సభకు వచ్చే వారందరికీ కొంగరకలాన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సురక్షిత వాతావరణాన్ని కల్పించామని ఆయన వెల్లడించారు.

Samayam Telugu 2 Sep 2018, 12:34 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి.. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో నిర్వహించ తలపెట్టిన 'ప్రగతినివేదన' సభకు తెలంగాణలోని అన్ని నియోజక వర్గాలు, మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలివస్తున్నారు. శాంతిభద్రతల కోసం 20 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. సభకు వచ్చే వారందరికీ కొంగరకలాన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి సురక్షిత వాతావరణాన్ని కల్పించామని ఆయన వెల్లడించారు.
Samayam Telugu tpolice


పోలీసులు సూచించిన మార్గాలు, రోడ్లపై ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని స్పష్టంచేశారు. సభకు 20 వేల మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారికి పోలీసులు సహకరిస్తారని, అంబులెన్సులకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని స్పష్టంచేశారు. సీసీ కెమెరాల ద్వారా మొత్తం ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు.

నగరం గులాబీమయం
కనీవినీ ఎరుగని రీతిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభతో హైదరాబాద్ రోడ్లన్ని గులాబిమయంగా మారిపోయాయి. భాగ్యనగరంలో ఎటు చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. భారీ హోర్డింగ్ లు, హైడ్రోజన్ బెలూన్లు, ఫెక్సీలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కళ్లకు కట్టారు. ప్రత్యేక ఆకర్షణగా మినీ హోర్డింగ్స్ తో మెట్రో పిల్లర్లు నిండిపోయాయి. ప్రగతి నివేదన సభ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీ రంగును సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.