యాప్నగరం

సుమన్ టీడీపీ నుంచే పోటీచేస్తారా?

అలనాటి తెలుగు హీరో సుమన్ రాజకీయ రంగప్రవేశం చేసే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.

TNN 10 Jul 2017, 9:25 am
అలనాటి తెలుగు హీరో సుమన్ రాజకీయ రంగప్రవేశం చేసే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు పాపులర్ హీరోగా ఎదిగిన సుమన్ తదనంతరం కొన్ని కారణాల చేత జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తరవాత అడపాదడపా సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. అయితే సుమన్ దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడింది. ప్రస్తుతం టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్న సుమన్.. ఇకపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకున్న సినీ గ్లామర్‌ను ఉపయోగించుకుని రాజకీయాల్లో స్థిరపడాలని ఆయన చూస్తున్నారు. 2019లో కచ్చితంగా పోటీచేస్తానని గతంలో ఆయన ప్రకటించారు.
Samayam Telugu senior actor suman to join in tdp
సుమన్ టీడీపీ నుంచే పోటీచేస్తారా?


టీడీపీలో సుమన్‌కు ప్రాధాన్యత లభించడంలేదని, కాబట్టి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆ తరవాత జనసేనలో చేరుతున్నారని రూమర్లు వచ్చాయి. వీటిపై ఇంటర్నెట్‌లో బోలెడన్ని కథనాలు ప్రత్యక్షమయ్యాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే ఆయన తెలుగు దేశం పార్టీని వీడేటట్లు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫునే పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సుమన్‌.. ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ పర్యటనలో భాగంగా గతంలో పరిచయమున్న ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిని కలిశానని, దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదని సినీనటుడు సుమన్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.