యాప్నగరం

టీడీపీకి మోత్కుపల్లి గుడ్‌బై చెబుతారా?

మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణలో పరిచయం అక్కర్లేని సీనియర్ రాజకీయనేత. టీడీపీలో చురుకైన నేతగా ఎదిగిన ఆయన... సైకిల్ దిగిపోతారనే ప్రచారం ఊపందుకుంటోంది.

TNN 1 Mar 2018, 5:54 pm
మోత్కుపల్లి నర్సింహులు... తెలంగాణలో పరిచయం అక్కర్లేని సీనియర్ రాజకీయనేత. టీడీపీలో చురుకైన నేతగా ఎదిగిన ఆయన... సైకిల్ దిగిపోతారనే ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశాలకు మోత్కుపల్లి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు నేతలతో భేటీలో చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేస్తామనే అధికారం మోత్కుపల్లి సహా ఎవరికీ లేదని... అలా ఎవరైనా మాట్లాడితే వారు పార్టీ వ్యతిరేకులేనని చెప్పారట. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన నష్టమేం లేదని బాబు అన్నారట. ఈ వ్యాఖ్యలు మోత్కుపల్లిని ఉద్దేశించనవని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే... పార్టీ మార్పు ఖాయమంటున్నారు.
Samayam Telugu senior leader motkupalli narasimhulu leave tdp
టీడీపీకి మోత్కుపల్లి గుడ్‌బై చెబుతారా?


ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. టీఆర్‌ఎస్‌లో టీడీపీని విలీనం చేయాలనడం వివాదాస్పదమయ్యింది. అప్పటి నుంచి మోత్కుపల్లి పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇప్పుడు పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలకు ఆయన రాకపోవడంతో ఆయన్ను టీడీపీ లెక్కలో నుంచి తీసేసినట్లేనని ప్రచారం నడుస్తోంది. అలాగే మోత్కుపల్లి గవర్నర్ అవుతారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా ఆ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఛాన్స్ కూడా లేదు. అందుకే ఆయన పార్టీ మారతారనే వాదన కూడా ఉంది. మరి ఈ పుకార్లపై మోత్కుపల్లి స్పందిస్తారా... పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తారా చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.