యాప్నగరం

జెేఎన్టీయూలో ర్యాగింగ్: నగ్నంగా పరిగెత్తించారు

హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఉన్న జేఎన్టీయూలో ఓ జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ జరిగింది.

TNN 30 Nov 2016, 4:58 pm
హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఉన్న జేఎన్టీయూలో ఓ జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ జరిగింది. ఆ విద్యార్థి బుధవారం ప్రిన్సిపల్‌ ఫిర్యాదు ఇవ్వడంతో విషయం బయటికి వచ్చింది. బాధితుడు చెప్పిన కథనం ప్రకారం... వనపర్తి జిల్లాకు చెందిన రాఘవేంద్ర బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి సీనియర్ విద్యార్థులు నిర్భయ్, సాయి సూర్య తేజ కలిసి రాఘవేంద్రను తమ హాస్టల్ కు రమ్మని అడిగారు. అందుకు రాఘవేంద్ర నిరాకరించాడు.
Samayam Telugu senior students ragged junior in jntu hyderabad
జెేఎన్టీయూలో ర్యాగింగ్: నగ్నంగా పరిగెత్తించారు


రాఘవేంద్ర కిన్నెర హాస్టల్ లో, నిర్భయ్, తేజలు మంజీరా వసతి గృహాల్లో ఉంటున్నారు. కాగా మంగళవారం రాత్రి ఆ ఇద్దరు రాఘవేంద్ర ఉంటున్న గదికి వెళ్లి బలవంతంగా బయటికి లాక్కొచ్చారు. కొట్టడంతో పాటూ, క్యాంపస్ లో నగ్నంగా పరిగెత్తించారు. దీనిపై బుధవారం బాధితుడు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ కమిటీని వేశారు ప్రిన్సిపల్. విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ఆందోళన చేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.