యాప్నగరం

దివ్యాంగుల సంక్షేమానికి మంత్రిత్వశాఖ

వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Samayam Telugu 6 Jan 2017, 12:16 pm
వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హయంలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉందని, ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ శాఖ స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు.
Samayam Telugu separate ministry for disabled welfare demands tdp mla revanth reddy
దివ్యాంగుల సంక్షేమానికి మంత్రిత్వశాఖ


వికలాంగుల (దివ్యాంగులు) సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే వారి అభివృద్ధి త్వరితగతిన ఆశించవచ్చని, వారి సమస్యల పరిష్కారం కూడా త్వరగా కృషి చేయవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

దీంతో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విద్యా, ఉద్యోగాల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం మాదిరిగానే వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీఠ వేయాలని ఆయన కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.