యాప్నగరం

​అమిత్ షా.. వెళ్తూ వెళ్తూ బాబుకు ఏం చెప్పారంటే..!

తెలుగు రాష్ట్రాల పర్యటనను పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు

TNN 26 May 2017, 3:46 pm
తెలుగు రాష్ట్రాల పర్యటనను పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి బాధ్యతను అప్పగించి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తును తెంచుకోవాలన్న బీజేపీ నేతల, కార్యకర్తల ఫిర్యాదులు.. మరోవైపు తెలుగుదేశం అధినేత ఇచ్చిన విందు.. ఈ నేపథ్యంలో షా బాబు చెవిన ఒక మాట వేసినట్టుగా తెలుస్తోంది.
Samayam Telugu shah asks a favor from babu
​అమిత్ షా.. వెళ్తూ వెళ్తూ బాబుకు ఏం చెప్పారంటే..!


అది రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారానికి సంబంధించినది. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము చెప్పిన వారే ఆసీటులో కూర్చోవాలని మోడీ, షాలు అనుకుంటున్నారు. అందుకోసం అందరినీ కలుపుకుపోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల నేతలను కూడా కలుపుకుపోవడానికి మోడీ, షాలు సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ విషయంలో బాబుకు కూడా బాధ్యతను అప్పగించారట షా.

అది కూడా మమతా బెనర్జీని ప్రసన్నం చేసే బాధ్యతను! దేశంలో మోడీతో ఢీ అంటే ఢీ అంటున్న నేతల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమత ముందున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీయేకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలిపేందుకు మమత తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకే ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. ఆమె చంద్రబాబుకు పరిచయస్తురాలే.. ఆమె మద్దతును బీజేపీ డైరెక్టుగా అడగలేదు. అందుకే.. ఆమెతో మాట్లాడాలని, ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ఆమెను కోరాలని.. బాబుకు చెప్పారట షా.

మరి ఢిల్లీ లెవల్లో మమతా బెనర్జీ వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల అభ్యర్థి ఎంపికలో ఆమె బిజీగా ఉన్నారు. మరి ఆమె బీజేపీ దారికి వచ్చేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.