యాప్నగరం

షీటీమ్ ప్రారంభమై నేటికి రెండేళ్లు

ఆకతాయిల ఆటకట్టించడానికి ఏర్పాటు చేసిన ‘షీ టీమ్’కు రెండేళ్లు నిండాయి.

TNN 24 Oct 2016, 6:22 pm
హైదరాబాద్ నగరంలో ఆకతాయిల ఆటకట్టించడానికి ఏర్పాటు చేసిన ‘షీ టీమ్’కు రెండేళ్లు నిండాయి. 2014 అక్టోబర్ 14న 100 షీ టీమ్‌లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. వాటి గురించి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బస్టాపులు, వివిధ కూడళ్ల వద్ద హోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేశారు. మహిళలెంతో మంది సాయం కోసం, రక్షణ కోసం షీటీమ్ లను ఆశ్రయించాయి. ఈ రెండేళ్లలో షీ టీమ్ 800 మంది ఆకతాయిల్ని పట్టుకుంది. అలాగే రెండేళ్లలో 2,362 ఫిర్యాదులు అందాయి. వాటిలో 100కి ఫోన్ చేసి చెప్పిన వారు 1217 కాగా, ఫేస్‌బుక్ ద్వారా 322, నేరుగా వచ్చి ఫిర్యాదు చేసినవి 421, ఈ మెయిల్ ద్వారా 183, వాట్సాప్ ద్వారా 175, మొబైల్ అప్లికేషన్ ద్వారా 44 అందాయి. ఈవ్ టీజింగ్ కు పాల్పడే ఆకతాయిలకు షీ టీమ్ సింహస్వప్నంలా మారింది. అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ఈ షీటీమ్‌లు నడుస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.