యాప్నగరం

అశోక్ గజపతిరాజుపై కేటీఆర్ స్వీట్ కామెంట్!

‘‘దేశంలో గత 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు వస్తే.. అశోక్ గజపతి రాజు పౌర విమానాయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో దాదాపు 50 నుంచి 60కి పైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటయ్యాయి’’

Samayam Telugu 8 Mar 2018, 10:48 pm
‘‘ఉదయం లేవగానే పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్త చూసి ఆశ్చర్యపోయా’’ అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాదులోని బేగంపేటలో జరిగిన వింగ్స్ ఇండియా సదస్సులో మాట్లాడుతూ.. ‘‘పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం’’ అని అశోక్ గజపతి రాజును కొనియాడారు.
Samayam Telugu asdfs


‘‘ఆంధ్రప్రదేశ్ రాజకీయా పరిణామాల వల్ల ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావల్సిన ఆయన రాలేకపోయారు. ఈ నేపథ్యంలో నేనే ముఖ్య అతిథిగా వ్యవహరించాల్సి వచ్చింది. దేశంలో గత 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు వస్తే.. అశోక్ గజపతి రాజు పౌర విమానాయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో దాదాపు 50 నుంచి 60కి పైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటయ్యాయి’’ అని కొనియాడారు’’.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.