యాప్నగరం

గంగుల కమలాకర్‌కు షోకాజ్‌ నోటీసులు

వాట్సాప్‌లో ఫొటోలు షేర్ కావడం, వీటిని ఆధారంగా చేసుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 1 Oct 2018, 3:54 pm
తెలంగాణ అసెంబ్లీ రద్దయిన రోజు నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తెలిపింది. ఆపద్ధర్మ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని, నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లేనని ఈసీ స్పష్టం చేంది. ఈ క్రమంలో కరీంనగర్‌లొ ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Samayam Telugu Gangula Kamalakar


తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌లోని 44వడివిజన్‌లో సాయిబాబా దేవాలయం వద్ద సీసీరోడ్ల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు డిప్యూటీ మేయర్‌ గుగ్గిల్లపు రమేశ్‌, 44వ డివిజన్‌ కార్పొరేటర్‌ అజిత్‌రావు, మాజీ కార్పొరేటర్‌ సదానందచారి, తదితరులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌లో షేర్ అయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకుని నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు.

భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల సహా ఇతర నేతల చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా ఎందుకు భావించరాదో వివరణ ఇవ్వాలంటూ సర్ఫరాజ్‌అహ్మద్‌ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నేతలకు ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో అక్టోబర్‌ 3న జెట్‌ స్పీడ్‌ బోట్ల ప్రారంభోత్సవం జరగనుండగా, అందులో పాల్గొంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అవుతుందా లేదా అని జిల్లాలో చర్చ జరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.