యాప్నగరం

పరిశుభ్రతలో తెలంగాణకు రెండు ఫస్ట్ ర్యాంకులు

పరిశుభ్రత విషయంలో జాతీయస్థాయిలో తెలంగాణ మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛదర్పణ్ జిల్లా ర్యాంకుల్లో తెలంగాణ నుంచి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నాయి. స్వచ్ఛభారత్ అమలు, నిధుల వినియోగం - ప్రజల్లో అవగాహన, పారదర్శకత తదితర..

TNN 26 Sep 2017, 2:27 pm
పరిశుభ్రత విషయంలో జాతీయస్థాయిలో తెలంగాణ మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛతాదర్పణ్ ర్యాంకుల్లో తెలంగాణ నుంచి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నాయి. స్వచ్ఛభారత్ అమలు, నిధుల వినియోగం - ప్రజల్లో అవగాహన, పారదర్శకత తదితర అంశాల ప్రాతిపాదికన ఆయా జిల్లాల్లో అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర ప్రభుత్వం జిల్లాలవారీగా ర్యాంకులు ప్రకటించింది.
Samayam Telugu siricilla bags first rank in swachhata darpan mission
పరిశుభ్రతలో తెలంగాణకు రెండు ఫస్ట్ ర్యాంకులు


దేశవ్యాప్తంగా మొత్తం 619 జిల్లాల్లో సర్వే చేపట్టగా కేవలం 39 జిల్లాలు మాత్రమే 90 శాతానికి పైగా మార్కులు సాధించాయి. ఈ 39 జిల్లాలను కేంద్రం నంబర్ 1 జిల్లాలుగా ప్రకటించింది. వీటిలో తెలంగాణ నుంచి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు తొలి స్థానం దక్కించుకున్నాయి. ఇప్పటికే వీటిని బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) జిల్లాలుగా ప్రకటించారు.

ఈ 39 జిల్లాల్లో గుజరాత్ నుంచి అత్యధికంగా 17 జిల్లాలు తొలిస్థానాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. స్వచ్ఛభారత్ - స్వచ్ఛ తెలంగాణ పేరిట ప్రభుత్వ నిర్వహించిన ప్రచారంతో సిరిసిల్ల ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వైపు అడుగులు వేశారు.

తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లను పరిశుభ్రంగా తీర్చి దిద్దడానికి మంత్రి కేటీఆర్.. అధికారులతో కలిసి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్వచ్ఛతాదర్పణ్ ర్యాంకుల్లో సిరిసిల్లకు తొలి స్థానం దక్కడంపై ఆయన ట్విట్టర్ ద్వారా హర్షం ప్రకటించారు.
Delighted that Siricilla district has been ranked No. 1 in India on Swachhata Darpan rankings by Govt of India. Congrats @Collector_RSL 👍 pic.twitter.com/v332mDVab6 — KTR (@KTRTRS) September 25, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.