యాప్నగరం

చెక్ బౌన్స్ కేసు.. ఎన్టీఆర్ కుమారుడికి జైలు శిక్ష

నటరత్న, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష పడింది.

TNN 7 Sep 2017, 1:56 pm
నటరత్న, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణకు చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.25 లక్షల జరిమానాను విధించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. 2015లో జయకృష్ణపై చెక్ బౌన్స్ కేసు రిజిస్టర్ అయ్యింది. సుమారు రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. అయితే జయకృష్ణ పైకోర్టులో అప్పీల్ చేసుకునే విధంగా నెలరోజులపాటు బెయిల్ మంజూరు చేసింది.
Samayam Telugu six months jail for ntrs son nandamuri jayakrishna in cheque bounce case
చెక్ బౌన్స్ కేసు.. ఎన్టీఆర్ కుమారుడికి జైలు శిక్ష


అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్‌, పార్కింగ్‌ లీజుకు సంబంధించి నందమూరి జయకృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్‌ కావడంతో నర్సింగరావు అనే వ్యక్తి ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జయకృష్ణను దోషిగా పేర్కొన్న కోర్టు.. ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, భారీ జరిమాన విధించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకుగానూ జయకృష్ణకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబీకులు ఇప్పటి వరకు స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.