యాప్నగరం

విజయవాడ: యువ ఇంజినీర్ అదృశ్యం

ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు.

TNN 10 Apr 2017, 12:38 pm
ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా ప్రసాదం పాడుకు చెందిన నాగసాయి (25) హైదరాబాద్‌లోని సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా నాగసాయి సోదరుని కుటుంబం విజయవాడలో నివసిస్తోంది. నాగసాయి సెలవుపెట్టి వారం క్రితం విజయవాడ వెళ్లాడు. శనివారం రాత్రి ఏడుగంటల సమయంలో నాగసాయి పనుందంటూ బైక్ పై బయటికి వెళ్లాడు. కాసేపటికే తన అన్నయ్య సంతోష్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ప్రకాశం బ్యారేజి నుంచి దూకేస్తున్నానని పేర్కొన్నాడు. అమ్మానాన్నలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. తిరిగి సంతోష్ ఏమైందో చెప్పాలని మెసేజ్ పెట్టినప్పటికీ తిరిగి సమాధానం లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లి చూసినా ఫలితం లేకపోయింది.
Samayam Telugu software engineer goes missing in vijayawada
విజయవాడ: యువ ఇంజినీర్ అదృశ్యం


దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. వారు చెప్పిన దాని ప్రకారం... నాగసాయి ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య తిరుపతి కూడా వెళ్లి వచ్చాడని చెప్పారు. వాళ్లన్నయ్యకి వాట్సాప్ మెసేజ్ ఇచ్చాక... నాగసాయి కాసేపు ఫేస్ బుక్ లైవ్ లో కూడా ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాల్ డేటాను తీయిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందేమో అని విచారణ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.