యాప్నగరం

ఎమోషన్‌లో పార్టీలు పెడుతున్నారు: బాబు

కొంతమంది ఎమోషన్ తో రాజకీయపార్టీలు పెడుతున్నారని.. ఆరు నెలల తర్వాత వాటిని వదిలించుకుంటున్నారని టీడీపీ అధినేత,

Samayam Telugu 29 May 2017, 6:27 pm
కొంతమంది ఎమోషన్ తో రాజకీయపార్టీలు పెడుతున్నారని.. ఆరు నెలల తర్వాత వాటిని వదిలించుకుంటున్నారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వాళ్ల శక్తి ప్రజలకు తెలిసిపోవడంతోనే వారు పార్టీలను వదిలించుకుంటారని బాబు ఎద్దేవా చేశారు.
Samayam Telugu some people float political parties with emotions chandrababu
ఎమోషన్‌లో పార్టీలు పెడుతున్నారు: బాబు


విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. చాలా పార్టీలు వచ్చినా అవి నిలువలేని పరిస్థితులు ఉన్నాయని బాబు విమర్శించారు. ఇది ఒక రాజకీయపార్టీలకే కాదు.. కంపెనీలకు కూడా అదే పరిస్థితి అని బాబు వివరించారు. ‘మనం చినప్పుడున్న కంపెనీలు ఇప్పుడు లేవు. ఐదేళ్ల వరకు బాగానే ఉండి తర్వాత కనుమరుగవుతున్నాయి’ అని బాబు చెప్పారు.

ఒకప్పుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చింది. రియల్ టైంలో మనం ఏం మాట్లాడినా ప్రపంచమంతా చూసే అవకాశం ఉంది. మహానాడు కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో 11లక్షల మంది వీక్షించారు. ఆ తర్వాత 82లక్షల మంది వీక్షించారు. ప్రపంచంలో ఎక్కడైనా దాదాపు కోటి మందికా మన కార్యక్రమాన్ని చూశారు.

ఈ మహానాడు వేదికన వివిధ అంశాలపై 34 తీర్మానాలను ప్రవేశపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.