యాప్నగరం

గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.

TNN 27 Mar 2017, 6:58 pm
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్‌ పొడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఆ ఆందోళనల మధ్యే అసెంబ్లీ.. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి (మార్చి 28) వాయిదా వేశారు.
Samayam Telugu speaker kodela adjourns ap assembly
గందరగోళం మధ్య ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా


ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్‌ వర్సిటీ బిల్లు, ఏపీ మౌలిక సదుపాయాల చట్ట సవరణ బిల్లు, ఏపీ వ్యాట్‌ చట్ట సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక బోర్డు బిల్లు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ చట్ట సవరణ బిల్లు, రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణ బిల్లులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ ఆమోదం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.