యాప్నగరం

అధిష్టానంపై 'ఆనం' అలక.. పార్టీ మారతారా?

టీడీపీలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం మొదలయ్యింది.

Samayam Telugu 3 Jun 2018, 7:02 pm
టీడీపీలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం మొదలయ్యింది. దీనికి బలాన్ని చేకూరుస్తూ రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో సన్నిహితులు, ముఖ్య అనుచరులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారట. మొన్నటి వరకు ఊగిసలాటలో ఉన్న ఆనం.. ఈసారి మాత్రం గట్టి నిర్ణయమే తీసుకుంటారని పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది.
Samayam Telugu Anam


అనుచరులతో భేటీమాత్రమే కాదు.. పదిరోజుల నుంచి ఆనం పార్టీతో కాస్త అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో నేరుగా పార్టీ, నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆనం నెల్లూరులో ఉన్నా.. శనివారం ఆత్మకూరులో జరిగిన నవ నిర్మాణ దీక్షకు కూడా హాజరుకాలేదు. స్థానిక నేతలే వేదికపై కనిపించి.. కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇంఛార్జ్‌గా ఉన్న రామనారాయణరెడ్డి పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండటంతో.. ఇటు ఆత్మకూరు నియోజకవర్గం కేడర్ కూడా అయోమయంలో ఉంది.

ఆనం వైసీపీ గూటికి వెళతారని మూడు నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు ఫోటోను కూడా తీసేయడంతో పార్టీ మార్పు ఖాయమనుకున్నారు. ఈలోపే ఆనం వివేకా చనిపోవడం.. రామనారాయణరెడ్డిని కూడా అధిష్టానం బుజ్జగించడంతో కాస్త మెత్తబడ్డారు. కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాగా.. మళ్లీ ఇప్పుడు ఆయన టీడీపీపై అలకబూనగా.. ఆనం వ్యవహారాన్ని అధినేత ఎలా డీల్ చేస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.