యాప్నగరం

సౌతాఫ్రికాలో మెరిసిన తెలుగు అందం..

తెలుగమ్మాయి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను ‘మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గాటెంగ్‌’ కిరీటం గెలుచుకున్నారు. ఐటీ నిపుణురాలైన శ్రీశుభ (25) గతంలో విప్రో టెక్నాలజీలో..

TNN 5 Sep 2017, 9:51 am
తెలుగమ్మాయి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను ‘మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గాటెంగ్‌’ కిరీటం గెలుచుకున్నారు. ఐటీ నిపుణురాలైన శ్రీశుభ (25) గతంలో విప్రో టెక్నాలజీలో పనిచేశారు. ప్రస్తుతం జోహన్నెస్‌బర్గ్‌లో స్టాండర్డ్ బ్యాంకులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తన స్నేహితుల ప్రోత్సాహంతో ఈ పోటీలో నిలిచినట్లు తెలిపారు. స్థానిక సుందరీమణులు ఎనిమిది మంది నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఆమె విజేతగా నిలిచారు. పోటీలో భాగంగా పలు విభాగాల్లో ఆమె మంచి ప్రతిభ కనబరిచారు. శ్రీశుభ.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి చెందినవారు.
Samayam Telugu srisubha addepalli of andhra pradesh wins miss india south africa gauteng title
సౌతాఫ్రికాలో మెరిసిన తెలుగు అందం..


ఈ పోటీ సందర్భంగా శ్రీశుభ ఓ నృత్య ప్రదర్శన కూడా ఇచ్చారు. తన జీవితానికి సంబంధించిన 3 కీలక దశలను కేవలం 3 నిముషాల వ్యవధిలో అద్భుతంగా ఆవిష్కరించారు. సున్నిత భావజాలం, మృదు స్వభావం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని ఆమె తెలిపారు.

తన నాట్యంలోని తొలి దశలో ఆమె తన కోమల నేపథ్యాన్ని ప్రదర్శించారు. తండ్రి మరణం లాంటి వ్యధాభరిత పరిణామాలతో కుంగదీసిన అనుభవాలను రెండో దశలో ప్రతిబింబింపజేశారు. మూడో దశలో ‘నేనెవరు’ అనే తన ఆంతరంగిక అన్వేషణను ప్రదర్శించారు. ఈ నాట్యం న్యాయనిర్ణేతల ప్రశంసలను అందుకుంది.

27 ఏళ్ల కిందట ‘మిస్‌ ఇండియా దక్షిణాఫ్రికా పోటీ’ని ప్రారంభించినట్లు ఫరూక్‌ ఖాన్‌ తెలిపారు. ఈ కిరీటాన్ని గెలుచుకున్న రెండో భారతీయ యువతి శ్రీశుభ అని ఆయన చెప్పారు. 2009లో ఈ కిరీటాన్ని దక్కించుకున్న భారతీయ యువతి ఆయుషీ చాబ్రా ప్రస్తుతం న్యూయార్క్‌లో ప్రముఖ మోడల్, నటిగా కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.