యాప్నగరం

భేటీలు, ఒప్పందాలతో బిజీబిజీగా కేటీఆర్

మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో ఇవాళ (నవంబర్ 21) పర్యటనలు, భేటీలతో బిజీబిజీగా గడిపారు. ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ‘స్టేట్ స్ట్రీట్’ చైర్మన్, సీఈవో జే హూలీ బృందం కేటీఆర్‌తో భేటీ అయ్యింది. అనంతరం ఆ కంపెనీకి చెందిన హైదరాబాద్ విభాగాన్ని కేటీఆర్ ప్రారంభించారు.

TNN 21 Nov 2017, 9:27 pm
మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో ఇవాళ (నవంబర్ 21) పలు పర్యటనలు, భేటీలు, ఒప్పందాలతో బిజీగా గడిపారు. ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ‘స్టేట్ స్ట్రీట్’ చైర్మన్, సీఈవో జే హూలీ బృందం కేటీఆర్‌తో భేటీ అయ్యింది. అనంతరం ఆ కంపెనీకి చెందిన హైదరాబాద్ విభాగాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ప్రముఖ టైర్ల కంపెనీ ఎమ్మార్‌ఎఫ్ ఎండీ అరుణ్ మమ్మెన్ బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసి సుదీర్ఘ చర్చలు జరిపింది. తెలంగాణలో ఆ కంపెనీకి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాన్ని మరింత విస్తృత పరచనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Samayam Telugu state street mrf and jetro representatives meet minister ktr
భేటీలు, ఒప్పందాలతో బిజీబిజీగా కేటీఆర్


జపాన్‌కు చెందిన వాణిజ్య బృందం, తకుమా, క్యాట్23 ప్రతినిధుల బృందంతోనూ ఆయన సమావేశమయ్యారు. మెట్రో రైల్ భవన్‌లో జరిగిన ఈ భేటీకి టీఎస్‌పీసీబీ, ఈపీటీఆర్‌ఐ అధికారులు హాజరయ్యారు. వ్యర్థ పదార్థాల నిర్వహణలో సాంకేతిక వినియోగంపై ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పెద్ద నగరాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని జపాన్ ప్రతినిధి బృందాన్ని కేటీఆర్ కోరారు. చెత్త నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, వేస్ట్ టూ ఎనర్జీ, సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులు మొదలైన అంశాలపై జపాన్ సహకారాన్ని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నగరంలోని అతి కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్‌ రోడ్డు వెలుపలకు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు జపాన్ ప్రతినిధులకు కేటీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో అత్యుత్తమ కాలుష్య నియంత్రణ పద్ధతులను అనుసరించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఫార్మా సిటీ లాంటి ప్రాజెక్టుల్లో కాలుష్య నియంత్రణకు చేపట్టనున్న అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఆయన వివరించారు.

టోక్యో క్లీన్ ఎయిర్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను జపాన్ ప్రతినిధి బృందం కేటీఆర్‌కు వివరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్లీన్ ఎయిర్ అథారిటీకి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. జపాన్ బృందం రాష్ట్రంలో 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. బీబీనగర్ పవర్ ప్లాంటు, జవహర్‌నగర్ డంప్ యార్డ్‌ను సందర్శిస్తారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పర్యటించి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై నివేదిక ఇస్తారు.
Inaugurated & spoke at the @StateStreet Hyderabad facility which is growing rapidly. They are a 225 year old financial services company It was great meeting Jay Hooley, Chairman & CEO of State Street along with other leadership team pic.twitter.com/dkmyzjaElA — KTR (@KTRTRS) November 21, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.