యాప్నగరం

ఊయలలో పిల్లాడిని చంపిన వీధి కుక్కలు

వీధి కుక్కలు నాలుగేళ్ల బాలుడిని చంపేశాయి. ఊయలలో పడుకున్న చిన్నారిని కిందికి లాగి మరీ పీక్కుతిన్నాయి.

TNN 21 Feb 2018, 8:23 am
పొలంలో వేరుశనగ నూర్పు ఉంది. తమ ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని ఆ తల్లిదండ్రులు నూర్పుకు వెళ్లారు. నూర్పిడి యంత్రానికి సమీపంలో మంచానికి ఊయల కట్టి అందులో బాబుని పడుకోబెట్టారు. అనంతరం ఆ దంపతులు నూర్పు పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో అక్కడికి వీధి కుక్కలు వచ్చాయి. ఊయలలో ఉన్న ఆ చిన్నారిని కిందికి లాగాయి. ముఖం, గొంతుపై కొరికి చంపేశాయి. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Samayam Telugu stray dogs killed 4 year old boy
ఊయలలో పిల్లాడిని చంపిన వీధి కుక్కలు


చిట్యాల గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు హుస్సేన్‌ పీరా, చాంద్‌బీ దంపతులకు కుమార్తె షాజహాన్‌(6), కుమారుడు ఇబ్రహీమ్‌(4) సంతానం. యంత్రంతో వేరుసెనగ పంట నూర్పిడి చేయడానికి చిన్న పిల్లాడిని వెంటబెట్టుకుని మంగళవారం పొలానికి వెళ్లారు. ఇబ్రహీమ్‌ను నిద్రపుచ్చి ఊయలలో పడుకోబెట్టారు. ఆ తరవాత యంత్రంతో వేరుశనగ పంట నూర్పు మొదలుపెట్టారు. ఇంతలో అక్కడి వచ్చిన కుక్కలు ఇబ్రహీమ్‌పై దాడిచేశాయి. పనిలో నిమగ్నమైన తల్లిదండ్రులు ఈ దారుణాన్ని గమనించలేకపోయారు.

కొంత సేపటికి తల్లి తన బిడ్డవైపు చూసింది. కుక్కలు పీక్కు తినడం చూసి ఒక్క ఉదుకున బిడ్డ దగ్గరికి వెళ్లింది. అప్పటికే ఆ చిన్నారి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లి కూడా సొమ్మసిల్లి పడిపోయింది. ఆ తండ్రి గుండెలు అవిసేలా రోదించాడు. కుక్కలు దాడిచేసినప్పుడు తమ బిడ్డ ఎంత నరక యాతక అనుభవించాడో అని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. కుక్కలు కరిచినప్పుడు గట్టిగా అరిచే ఉంటాడని, నూర్పిడి యంత్రం శబ్దం వల్ల బాబు కేకలు తమకు వినిపించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.