యాప్నగరం

టీఆర్టీ సరిగా రాయలేదని ఆత్మహత్య

చిన్న, చిన్న కారణాలకే విలువైన ప్రాణాలు తీసుకుంటోంది యువత. పరీక్ష సరిగా రాయలేదని... మార్కులు తక్కువొస్తాయోమనని... ఇలా కారణం ఏదైనా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందరికి కళ్ల నీళ్లు తెప్పిస్తోంది.

TNN 1 Mar 2018, 11:00 am
చిన్న, చిన్న కారణాలకే విలువైన ప్రాణాలు తీసుకుంటోంది యువత. పరీక్ష సరిగా రాయలేదని... మార్కులు తక్కువొస్తాయోమనని... ఇలా కారణం ఏదైనా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందరికి కళ్ల నీళ్లు తెప్పిస్తోంది. రామారెడ్డి మండలం అన్నారంకు చెందిన సుప్రజ ఈ నెల 25న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాసింది. రెండు మూడు రోజులుగా ఆమె పరీక్ష సరిగా రాయలేదనే ఆందోళనలో ఉంది. అదే బాధతో ఉన్న సుప్రజ... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ఆమె రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది.
Samayam Telugu student suicide fear of failing in trt exam in telangana
టీఆర్టీ సరిగా రాయలేదని ఆత్మహత్య


నాన్నా క్షమించండి... చాలా కష్టపడి చదివాను. కాని ఫలితం లేకుండా పోయింది. చేతులారా నేనే చేసుకున్నా. నాకు బతికాలని లేదు. టీచర్ వృత్తిపై తప్ప దేనిపైనా ఆశలేదు. ఇన్ని రోజులు నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఇకపై ఆ అవసరం లేదు. ఉద్యోగం వస్తుందనే ఆశతో చాలా కష్టపడి చదివాను. కాని అనుకున్న జీవితం దక్కలేదని చాలా బాధగా ఉంది. క్షమిచండి నాన్నా. నా వల్ల ఎవరూ బాధపడొద్దు. విధి నాతో ఆడుకొని... చదువురాని దానిలా ముద్ర వేసింది. నా కంటే చిన్నవాళ్లు ముందే పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా నాకు తర్వాత జీవితం ఉందనుకున్నా. కానీ ఇప్పుడు నాకు భవిష్యత్ లేదు. అమ్మను జాగ్రత్తగా చూసికోండి నాన్నా అంటూ లేఖ రాసింది. సుప్రజ మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.