యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు..హైదరాబాద్@42

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఉన్నట్టుండి రెండు రోజులుగా తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది.

Samayam Telugu 30 Apr 2018, 3:59 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్య ప్రతాపానికి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఉన్నట్టుండి రెండు రోజులుగా తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది. ఉదయం 9 గంటల నుంచి భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో... జనాలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతల విషయానికొస్తే... నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యధికంగా 44 డిగ్రీలు నమోదుకాగా... హైదరాబాద్‌లో ఏకంగా 42 టచ్ అయ్యింది. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు 40 డిగ్రీల టెంపరేచర్ ఉంది.
Samayam Telugu Sun




ఇక ఏపీ విషయానికొస్తే రాయలసీమలో ఎండలు మండిపోతుండగా... కోస్తాలో ఒకటి రెండు జిల్లాలు తప్ప మిగిలిన చోట్ల పరిస్థితి మెరుగ్గానే ఉంది. సీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా... కడప, చిత్తూరుల్లో 40 ఉంది. మిగిలిన జిల్లాల్లో 38 డిగ్రీలలోపే టెంపరేచర్ నమోదయ్యింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలతో పాటూ ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎండలు పెరుగుతాయని... ఉక్కపోత కూడా ఉంటుందంటున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా... మధ్యాహ్నం సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.