యాప్నగరం

స్వచ్ఛ తెలంగాణకు సమున్నత గౌరవం

మెరుగైన శుభ్రత పాటించి ఆదర్శవంతంగా నిలిచిన జిల్లాలు.. వరంగల్‌, మెదక్‌‌కు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో గురువారం (సెప్టెంబర్ 14) కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీటిని ప్రదానం చేశారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి, మెదక్‌ కలెక్టర్‌ భారతి హోళికేరి..

TNN 15 Sep 2017, 2:11 pm
‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను తెలంగాణకు సమున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 5 జిల్లాలకు స్వచ్ఛతా అవార్డులు దక్కగా.. అందులో 2 తెలంగాణనే వరించాయి. మెరుగైన శుభ్రత పాటించి ఆదర్శవంతంగా నిలిచిన జిల్లాలు.. వరంగల్‌, మెదక్‌‌కు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో గురువారం (సెప్టెంబర్ 14) కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీటిని ప్రదానం చేశారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి, మెదక్‌ కలెక్టర్‌ భారతి హోళికేరి కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
Samayam Telugu swachhata awards for warangal and medak districts of telangana
స్వచ్ఛ తెలంగాణకు సమున్నత గౌరవం


శుభ్రత పాటించడంలో మెరుగైన ప్రమాణాలు చూపిన విశ్వ విద్యాలయాలు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛతా ర్యాంకులు ఇచ్చారు. వీటిలో సాంకేతిక ఇన్‌స్టిట్యూట్‌ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌కు అవార్డు దక్కింది.

స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా నిలిచిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన శంభునిపల్లి గ్రామం ఇప్పుడు ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. అధికారుల కృషి, ప్రజల సహకారం వల్లే ఇది సాధ్యమైందని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త తొలగింపు లాంటి విషయాల్లో ఆదర్శంగా నిలిచింది. తమ గ్రామానికి అవార్డు రావడంతో శంభునిపల్లివాసులంతా స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

మెదక్‌ జిల్లాలోని ముజ్రంపేట గ్రామం కూడా స్వచ్ఛత విషయంలో ఉత్తమ ప్రమాణాలను పాటించి ఆదర్శంగా నిలిచింది. వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్లు వరసగా 3, 4 ర్యాంకులతో స్వచ్ఛతా అవార్డులు అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.