యాప్నగరం

నైపుణ్యం ఉన్నవారికి భయం అక్కర్లేదు!

కొంత మంది.. వారి అసమర్థత కారణంగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. కానీ, నిపుణులైన వారికి ఎప్పుడూ మంచి అవకాశాలే దక్కుతాయి..

TNN 13 Jun 2017, 7:34 pm
టాలెంట్ ఉన్నవారికి ఉద్యోగాలు కోల్పోతామన్న భయం అక్కర్లేదని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ‘కొంత మంది.. వారి అసమర్థత కారణంగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. కానీ, నిపుణులైన వారికి ఎప్పుడూ మంచి అవకాశాలే దక్కుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో జూన్ 12న ఏర్పాటు చేసిన క్వాల్‌కామ్ ఇండియాస్ ఫ్లాగ్‌షిప్ సీఎస్‌ఆర్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలికల్లో.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టుల్లో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఐటీ రంగంలో సుమారుగా 4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని జాబ్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు సాధించాలని ఆయన సూచించారు.
Samayam Telugu talented wont loose jobs jayesh ranjan
నైపుణ్యం ఉన్నవారికి భయం అక్కర్లేదు!


ఉన్నత విద్య విషయంలో అమ్మాయిలు ఇంకా చాలా వెనకబడే ఉన్నారని, ఇంటర్ పూర్తి చేసిన బాలికలతో పోల్చినప్పుడు ఉన్నత విద్య వైపు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గుతోందని ఈ సందర్భంగా వక్తలు గణాంకాలతో సహా వివరించారు. అందులోనూ సైన్స్, టెక్నాలజీ వైపు వస్తున్న వారు కేవలం 18 శాతం మందేనని వారు తెలిపారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.