యాప్నగరం

సర్వే ఫలితం: బీజేపీతో తెదేపా తెగతెంపులు?

ఏపీలో బీజేపీ తెలుగుదేశం దోస్తీ ముగియనుందా?

TNN 29 Nov 2016, 2:49 pm
ఏపీలో బీజేపీ తెలుగుదేశం దోస్తీ ముగియనుందా? ఇప్పటివరకు జట్టుగా ఉన్న పార్టీ నాయకులు ఇకపై కత్తులు దూసుకోనున్నారా? అవుననే అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు. రాష్ట్ర విభజన సమయంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడంతో పాటు ఆ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన పలు సహాయాలపై కొర్రీలు పెడుతున్న కేంద్ర వైఖరిపై తెలుగుదేశం నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పటివరకు చంద్రబాబు తన నేతలను కంట్రోల్లో ఉంచుతూ వచ్చారు. కేంద్రంతో దోస్తీ చేస్తూ కావలసిన వాటిని దక్కించుకుందామని ఆయన నచ్చచెప్పుతూ వచ్చారు. కానీ, ఎన్.డి.ఎ భాగస్వామిగా ఉన్నా కూడా ఇతర రాష్ట్రాలకు, ఏపీకి కేంద్రం చేసే సాయంలో ఏమాత్రం తేడా లేని విషయం పలు మార్లు చర్చకు వచ్చింది.
Samayam Telugu tdp and bjp friendship may comes to an end in ap
సర్వే ఫలితం: బీజేపీతో తెదేపా తెగతెంపులు?


ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక జరిపిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని వచ్చింది. ఈ సర్వే నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణుల్లో లేని ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేకహోదాపై మొండిచేయి చూపిన పార్టీతో అంటకాగుతూ ఏపీలో ప్రజల ఆగ్రహానికి గురవ్వాల్సిన అవసరం ఏముందని వారు అంటున్నారు. దీనిపై పార్టీలో అంతర్గతంగా కూడా బాబు వద్ద సన్నిహితులు చర్చలు కూడా నడుపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే దానిపై తెదేపా అధిష్టానం కూడా సీరియస్ గానే ఆలోచిస్తోందిట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.