యాప్నగరం

​టీడీపీ, జనసేన, బీజేపీ.. కలిసి పోటీ చేస్తాయి..!

ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని.. ఇది తథ్యమని.. రాసి పెట్టుకోవాలని..

TNN 18 Apr 2017, 9:57 am
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని రాష్ట్రమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేత మాధవ్ అభినందన సభలో అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ సఖ్యత కొనసాగుతోందని అయ్యన్న చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని అన్నారు.
Samayam Telugu tdp bjp janasena will be united quotes ap minister
​టీడీపీ, జనసేన, బీజేపీ.. కలిసి పోటీ చేస్తాయి..!


అలాగే పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా కూటమిలో ఉంటుందని అయ్యన్న అన్నారు. ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయని.. ఇది తథ్యమని.. రాసి పెట్టుకోవాలని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఎవరికీ అనూమానం అక్కర్లేదన్నారు.

అయితే తన పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్టుగా ఆ మధ్య పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తను ఎన్డీయే మనిషిగా ప్రచారం చేశానని.. ఇప్పుడు మాత్రం ఆ కూటమితో తనకు సంబంధం లేదని పవన్ చెప్పుకొచ్చారు. అడపాదడపా భారతీయ జనతా పార్టీపై పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. ఇటీవల తెలుగుదేశం ఎంపీల, కేంద్రమంత్రుల తీరును కూడా ఆయన తప్పుపట్టారు. తను కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేస్తానని కూడా పవన్ కల్యాణ్ అనేక సార్లు ప్రకటించారీమధ్య. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మంత్రి ఈ విధమైన ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.