యాప్నగరం

‘దెయ్యాలు వస్తాయ్‌.. ప్రమాణాలు చేయిస్తాయ్‌’: జగన్

మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఆగస్టు 18) పట్టణంలోని సాయిబాబానగర్‌లో..

TNN 18 Aug 2017, 8:22 pm
మూడున్నరేళ్లపాటు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని, ఇప్పుడు ప్రజలను కూడా కొనాలనుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఆగస్టు 18) పట్టణంలోని సాయిబాబానగర్‌లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నంద్యాలకు దెయ్యాలు వస్తాయి.. ఒక్కో ఓటరు చేతిలో రూ.5000 పెట్టి, ప్రమాణాలు చేయిస్తాయి. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. ధర్మానికి ఓటేసి దెయ్యాలని పారదోలాలి’ అని పేర్కొన్నారు.
Samayam Telugu tdp distributes money takes promise says ys jagan
‘దెయ్యాలు వస్తాయ్‌.. ప్రమాణాలు చేయిస్తాయ్‌’: జగన్


‘పులివెందులను ఏవిధంగా అభివృద్ధి చెయ్యాలనుకున్నానో, నంద్యాలను కూడా అలాగే చేస్తా. నంద్యాల అభివృద్ధి గురించి ఎవరూ భయపడకండి. మీరు న్యాయానికి ఓటేయండి. మీరు వేసే ఓటు.. చంద్రబాబు దుర్మార్గ పాలనకు చెంపపెట్టులాంటిది’ అని జగన్‌ అన్నారు. రూ. 86 వేల కోట్ల రుణం మాఫీ చేస్తానని రైతులను, రూ. 14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని మహిళలను, జాబు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు.. ఆఖరికి పసిపిల్లల జీవితాలతో కూడా ఆటలాడుకుంటున్నారని జగన్ మందిపడ్డారు.

‘ఏడాదిలోపు మూగ, చెవిటి పిల్లలకు మాత్రమే ఆపరేషన్లు చేస్తామంటున్నారు. అప్పటికి వారు లోపంతో బాధపడుతున్నారని గుర్తించడమే కష్టం! కేన్సర్‌ పేషెంట్లకు నెలకు ఏడెనిమిసార్లు కీమోథెరపీ అవసరం కాగా, 2 దఫాలకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. కిడ్నీ రోగుల డయాలసిస్‌ కోసం వెళితే.. ఏడాది తర్వాత రమ్మంటున్నారు. 108కి ఫోన్‌చేస్తే డీజిల్‌ లేదనో, జీతాల కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారనో సమాధానం వస్తుంది. బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో మద్యం హోండెలివరీ చేస్తామంటున్నారు. ఇదీ.. మూడేళ్ల పాలనలో చంద్రబాబు సాధించిన ఘనకీర్తి’ అని జగన్‌ విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.