యాప్నగరం

ఏపీ రాజ్యసభ ఎన్నికలు...టీడీపీ అంతపని?

ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు దక్కే రెండు సీట్లకూ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు కానీ..

TNN 6 Mar 2018, 12:34 pm
ఏపీ అసెంబ్లీ కోటాలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు దక్కే రెండు సీట్లకూ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు కానీ.. మూడో అభ్యర్థిని కూడా నిలుపుతుందనే ఊహాగానాలు ఆసక్తిని రేపుతున్నాయి. సభలో బలాబలాలను బట్టి.. ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కాల్సి ఉంది. తమకు దక్కే సీటు కోసం వైకాపా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. రేపు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు.
Samayam Telugu tdp field third candidate in rs elections
ఏపీ రాజ్యసభ ఎన్నికలు...టీడీపీ అంతపని?


అయితే ఇంతలో తెలుగుదేశం పార్టీ కూడా మూడో సీటు కోసం అభ్యర్థిని పోటీలో ఉంచనున్నదనే మాట వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం వర్గాలు ఈ మేరకు ప్రచారం చేస్తూ ఉన్నాయి. వైకాపాకు దక్కే సీటు విషయంలో కూడా టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటాడనే లీకులు ఇస్తున్నారు టీడీపీ వాళ్లు.

ఇప్పటికే వైకాపా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో కూడా ఉన్న వాళ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకోగలదు. అయితే... ఉన్న వాళ్లలోంచి కూడా కొంతమందిని తెలుగుదేశం పార్టీ తన వైపుకు తిప్పుకుంటే మాత్రం అప్పుడు వైకాపా అభ్యర్థి ఇబ్బందులు పడతారు.

ఇప్పటికే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి రాజ్యసభ సీటును నెగ్గాలని ప్రయత్నిస్తున్నారని అంటూ.. సీఈసీకి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది ఆ పార్టీ. మరి తెలుగుదేశం మూడో అభ్యర్థిని నిలబెడితే రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మరింత రసవత్తరంగా మారుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.