యాప్నగరం

భయంతోనే మోదీ కాళ్లు పట్టుకున్నారు: ఏపీ మంత్రులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తెదేపా మంత్రులు ఎదురుదాడికి దిగారు.

TNN 10 May 2017, 7:50 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తెదేపా మంత్రులు ఎదురుదాడికి దిగారు. బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన జగన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ఏపీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu tdp fires on ys jagan mohan reddy against his delhi visit
భయంతోనే మోదీ కాళ్లు పట్టుకున్నారు: ఏపీ మంత్రులు


పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న జగన్.. ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లపై పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. ఎన్‌డీఏకు మద్దతు పలికిన జగన్ పరోక్షంగా తమకు మద్దతు పలికినట్టేనన్నారు. మోదీని కలిసొచ్చాక జగన్ చాలా సంతోషంగా ఉన్నారని, ఈరోజు జగన్ కళ్లలో ఉన్న ఆనందం గతంలో ఎప్పుడూ కనపడలేదని ఎద్దేవా చేశారు. మోదీ కాళ్లపై పడ్డా జగన్‌పై ఉన్న కేసులు మాఫీ కావన్నారు. మోదీని జగన్ కలవగానే వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వచ్చారని, రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములం అవుతామని వారు అడుగుతున్నారని చెప్పారు.

మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బయట ఒకటి మాట్లాడి లోపల మరో నిర్ణయం తీసుకునే అలవాటు జగన్‌దని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని బీజేపీకి జగన్ ఎందుకు షరతు పెట్టలేదని ప్రశ్నించారు. కేసులకు భయపడి జగన్ బేషరతుగా ప్రధాని పాదాలపై పడినట్లు తాను భావిస్తున్నానన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలను విమర్శించడం జగన్‌కు అలవాటనని, ఆయనతో ఏ రాజకీయ పార్టీ పొత్తుపెట్టుకోదని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.