యాప్నగరం

కానిస్టేబుల్‌పై యువకుల దాడి.. చింతమనేని పేరుతో బెదిరింపులు

విజయవాడలో అర్థరాత్రి యువకుల వీరంగం.. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్‌పై దాడి. చింతమనేని అనుచరులమంటూ రగడ.

Samayam Telugu 28 Sep 2018, 3:53 pm
విజయవాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై యువకులు దౌర్జన్యం చేశారు. కారు ఆపినందుకు చిందులు తొక్కుతూ దాడి చేశారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. గురవారం అర్థరాత్రి దాటాక.. బందరు లాకుల దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ సునీల్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో (ఏపీ16 సీఎం 2244) కారు అటుగా వచ్చింది. ఓవర్ స్పీడుతో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి ముందుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ ఆ కారును ఆపి.. పక్కకు పెట్టించాడు.
Samayam Telugu Vja.


కారులో నుంచి కిందకు దిగిన యువకులు.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. కారు ఎందుకు ఆపావంటూ దుర్భాషలాడారు. ఎవరైనా సరే కారును స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందేనన్నాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు.. కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. తాము దెందలూరు ఎమ్మెల్యే అనుచరులమంటూ హంగామా చేశారు. ఈలోపే అక్కడకు చేరుకున్న మరికొందరు పోలీసులు.. కారును గవర్నర్ పేట పీఎస్‌కు తరలించారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేశారు.

కానిస్టేబుల్‌పై దాడి ఘటన విజయవాడలో చర్చనీయాంశంకాగా.. ఈ వ్యవహారం చింతమనేని ప్రభాకర్ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై స్పందించిన చింతమనేని.. దాడి చేసిన వారెవరో తనకు తెలియదన్నారట. ఎవరో తన పేరు చెప్పి ఉంటారని.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.