యాప్నగరం

బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్, పవన్: కళావెంకట్రావు

ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై వీరిద్దరు కలిసి ప్రధాని మోదీని ఒప్పించాలని సూచించారు.

Samayam Telugu 29 Jul 2018, 4:56 pm
ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై వీరిద్దరు కలిసి ప్రధాని మోదీని ఒప్పించాలని సూచించారు. ఆదివారం (జులై 19) విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది అని జగన్‌ అంటున్నారని, మోదీ డైరెక్షన్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తాను భావిస్తున్నానని కళా అన్నారు. కాపులకు అన్యాయం చేసే నైజం జగన్‌లో స్పష్టంగా కనబడుతోందని.. కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని అన్నారు.
Samayam Telugu kala


జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను గురించి మాట్లాడుతూ.. రాజధానిని ఆపేస్తామనే రీతిలో పవన్ మాట్లాడటం సరికాదన్నారు. రాజధాని కట్టకుండా చేస్తానని ఎలా అంటున్నారని పవన్‌ను ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే అభివృద్ధి చేస్తామని చెప్పాలికానీ విష బీజాలు నాటడం సరికాదని కళా అభిప్రాయపడ్డారు. పవన్ పార్టీ పెట్టి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు విధి విధానాలు ప్రకటించలేదని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.