యాప్నగరం

తారక్‌తో బాలయ్యకు సంబంధాలున్నాయి కానీ,...

సినీనటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ సంబంధాలపై గత కొంతకాలంగా తెలుగునాట పెద్ద చర్చ కొనసాగుతోంది. అయితే దీనిపై ఇరువురూ పెదవి విప్పిన సందర్భాలు లేవు.

TNN 9 Oct 2017, 11:33 am
సినీనటుడు బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధాలున్నాయి గానీ, మంచి సంబంధాలున్నాయో లేదో, తనకు తెలియదని ఏపీ ఫిల్మ్, థియేటర్, డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నాయకుడు అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబికా కృష్ణ మాట్లాడారు. ‘టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్లీ దగ్గర చేయడానికి మీరు పెద్దన్నయ్య పాత్ర నిర్వహిస్తారా?’ అని ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘నేనెంత! పెద్ద పెద్ద వాళ్లు, మహా మేధావులు చాలా మంది ఉన్నారు. ఆ పని మేధావులు చేయాల్సిందే’ అని పేర్కొన్నారు. బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని, అలాగే నాపై కూడా ఆయనకు అంతే అభిమానమని వెల్లడించారు.
Samayam Telugu tdp leader ambica krishna comments for balakrishan and jr ntr relations
తారక్‌తో బాలయ్యకు సంబంధాలున్నాయి కానీ,...


‘పెద్ద మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, మోసం చేసిన వ్యక్తుల్లో మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని ప్రశ్నించగా, ‘అంబికా దర్బార్’ సంస్థ ఎప్పుడూ దివాళా తీయలేదని, అలాంటిదేమీ లేదని అన్నారు. చదువుకు, వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదని, తన తండ్రి చదువుకున్నది కేవలం మూడో తరగతేనని, ఇరవై ఐదు రూపాయలతో నాడు తమ సంస్థను స్థాపించారని తెలిపారు. ‘నేను పదో తరగతి చదివాను. నా జీవితంలో కాలేజీకి వెళ్లలేదని అని మరో ప్రశ్నకు సమాధానంగా అంబికా కృష్ణ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.