యాప్నగరం

ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అంత్యిక్రియలు ముగిశాయి. నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వివేకాను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.... ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

Samayam Telugu 26 Apr 2018, 8:04 pm
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అంత్యిక్రియలు ముగిశాయి. నెల్లూరులోని పెన్నా నది ఒడ్డున అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వివేకాను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.... ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అంతకు ముందు నెల్లూరు వీధుల్లో ఆనం అంతిమయాత్ర సాగింది. ఆయన్ను చూసి అభిమానులు కంటితడి పెట్టుకున్నారు. మరోవైపు ఉదయం నెల్లూరుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఆనంకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
Samayam Telugu Anam Viveka


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకానందరెడ్డి... సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 1999, 2004 , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల తన సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో కలసి టీడీపీలో చేరారు. ఆనంకు ఇద్దరు కుమారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.