యాప్నగరం

ఆందోళనకరంగా ఆనం ఆరోగ్యం.. చంద్రబాబు పరామర్శ

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య నిపుణులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.

Samayam Telugu 13 Apr 2018, 7:45 pm
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య నిపుణులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. గతకొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రేడియేషన్‌ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
Samayam Telugu చంద్రబాబు, ఆనం


ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు కిమ్స్‌కు వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్న ఆనం కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు బాబు. ఆనం పరామర్శించిన వారిలో బాబుతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.